uaaa uaaa (kaar kaar) నేను పుట్టాను

ఉఆఉఆ…  నేను పుట్టాను… ***********************************************

మేనత్త(సీత)  :   “వదినా!! అచ్చు నీ లాగే ఉంది పాప …”
అమ్మ            :    “నాలా  ఏం లేదు… మేనత్త పొలికలు దిగాయి.. రంగొక్కటే తేడా.. ”

మేనత్త(సీత)  :    “కళ్ళు నావే.. ముక్కు అమ్మది … రంగు నీది… నాలా పొట్టి అవుతుందో .. నీ పొడవు అవుతుందో”
మేనత్త(కృష్ణ) :    “అన్నయ్య కర్రెగా ఉన్నా నీలా ఎర్రగా పుట్టింది… దీని పెళ్ళికి చింత లేదులే.. హ హ …”

మూడేళ్ళ తర్వాత … *****************************************************

అమ్మ            :    “దీని అల్లరి భరించలేను .. ఒకటె యక్ష ప్రశ్నలేస్తుంది సీతమ్మ వేసినట్టు ”
నాన్న            :    “సాహులూ … ఇటు రామ్మా ..! ఇక్కడ ఆడుకో…!!   అమ్మని సతాయించకు …”
నేను              :    “ఏవండీ (నాన్నని అమ్మ ఏమని పిలిస్తే అలాగే పిల్చేది)!! .. అమ్మ నాకు రెండు బిస్కట్లు ఇవ్వట్లేదు”

అమ్మ            :    “అదానే నీ నస”

నాలుగేళ్ళు … **********************************************************

నేను              :    “నాన్నా .. మూర్తి మావయ్య వచ్చిండు !!”
నాన్న            :     “దీనికి ఈ భాష ఎవర్రా నేర్పించింది..!! మన ఇంట్లో ఎవరూ యాస మట్లాడకుండానే పట్టేసిందా..? హు దేవరకొండ  effect”
అన్న             :     “ఆకాశం లో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ …ఝుం ఝుం ఝుం ఝుంతన ఝుం.. ”
నాన్న            :     “వీడితో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పించాలనుకుంటే వీడేంటే..!? ”

రికార్దంగు మొదలు …. ****************************************************

నాన్న            :    “స్టార్ట్ …
అన్న             :    “టింకిల్ టింకిల్ లిత్తిత్తాల్   హవ్వయ్ వండర్ వాత్తు ఆర్ …. ”
నాన్న            :    “స్టాప్  …”
అమ్మ            :    “రికార్డు అయిందా అండి .!!?  ఎదీ వినిపించండి.. ”

అయిదేళ్ళు… **********************************************************

మేనత్త (సునంద) :   “స్కూల్లో ఏడవకుండా ఉంటుందా వదినా..?
అమ్మ                   :   “వీళ్ళ స్కూల్లో LKG టీచర్ కి ఇదంటే ఎంత ఇష్టమో .. కానీ నేను దీన్ని క్లాసులో వదిలి స్కూలు గేటు దగ్గరికి వచ్చే దాక కూడ మరిపించలేదు… కొన్ని రొజులు  తెలుగు   మీడియం ఒకటో తరగతి లో శివ తోపాటు కూర్చోపెడితే స్కూలంటే భయం పొతుందేమో  … నెత్తిన కుండ పెట్టుకొని  పుట్టింది..! ప్చ్!!”

క్లాస్ లో … ************************************************************

టీచర్           :  “పలకండి .. ఒకటీ … ”
విద్యార్థులు  : “ఒకటీ…”
టీచర్           : “రెండూ …”
విద్యార్థులు  : “రెండూ …”
నేను            : “తీచర్ తీచర్ నాకు ఇది రాదు.. ఆ తీచర్ ఏ బీ సీ డీ చెప్పింది అదే చెప్తా”…
టీచర్           : “!! ఎవరీ పిల్ల ?? ఈ క్లాస్  కాదే..!!”
శివ బావ      : “నా మరదలు టీచర్…  LKG లొ ఏడుస్తుందని ఇక్కడ కూర్చోపెట్టారు..!”
టీచర్           :”ఆఆ ..!!”

ఎనిమిది తొమ్మిది యేళ్ళు …************************************************

నేను            :   “ఇదిగో అమ్మమ్మ … మంచినీళ్ళూ…”
నాన్న సహోద్యొగిని (కాస్త సీనియరే ) :  “ఆసి భడవ … అమ్మమ్మ అంటావా ?? జుట్టు నరిసింది అంతే.. ఏం చదువుతూందండీ అమ్మాయి.. ?”
నేను & నాన్న  : “థర్డు క్లాసు .. ”
నాన్న సహోద్యొగిని : “తాతల తెలువులు ఎక్కడికి పొతాయ్ !! … ఫస్టు వస్తుందా క్లాసులో ?? ”
నాన్న : “ఎదో… మీ అభిమానం ఆశీర్వాదం … ”

అయిదో తరగతి అనుకుంటా … ***********************************************

అన్నయ్య తమ్ముడూ డిషుం డిషుం ఆడుకుంటున్నారు  ..  నేను  ఎత్తి ఉన్న మంచం కోడుకు వేలాడి ఊగుతున్నా.. నాన్న అప్పుడే ఇంట్లోకి వస్తున్నారు.. నేను చూశా.. చటక్కున చతికిల బడి బుక్ అందుకున్న….
నాన్న          :   “బెత్తం ఎదిరా..! ఆయ్..! గోలేక్కువయింది …! అది చూడంది ఎంత బుధ్ధిగా చదువుకుంటుందో .. ఆడ పిల్లని చూసి నేర్చుకోండిరా.. ”
నేను            :   (ఇదే అవకాశం హి హి ) “నాన్నా ..! విశాలి కి 5th టేబుల్ కూడా వచ్చంట.. బాబాయి ‘నాకూ నేర్పించు’ అంటే రాసివ్వలేదు  … ”
అన్న&  తమ్ముడు : “ప్చ్ రాక్షసి !! … మాకూ ఓ సిగ్నల్ ఇయ్యచ్చు కదే నాన్న వస్తున్నారని… ”

బాబాయి     :   “బాబాయి మీదే కంప్లయింటా .. కృష్ణ ని అత్తగారింటికి పంపాం .. ఇంకో కిష్టమ్మ తయారయింది..!”

ఇంకొంచెం పెద్దయ్యాక …****************************************************

నేను                     :   “అమ్మా రవణ మావయ్య కి టీ తీస్కురా  …. (నెక్స్ట్ డయలాగ్ మావయ్యది … అన్నట్టు సై గ చేశా… )”
రమణ మావయ్య :   “అమ్మాయ్ (అమ్మని మావయ్య అలాగే పిలుస్తాడు) …  లిటుకు కి కూడా ఓ కప్పు..”
నేను                     :   “మావయ్యా… !! నన్ను లిటుకు అని పిలవద్దు…”
రమణ మావయ్య  :  “సరే.. itihas …”  (sahiti ని తిరగేసి పిలవడం మావయ్యకి అలవాటు 🙂  నా పేరు లో ఈ  specialty ని కనిపెట్టింది ఆయనే..)
అమ్మ                   :   “రవణా..!  అది హార్లిక్స్ తాగింది లే …!”
రమణ మావయ్య  :  “అహ.. నా తోపాటు కంపెనీ ..”
నేను (మెల్లగా)     :   “మా మంచి మావయ్య.. :)” (ఇది మా ఇద్దరి టీ డీల్)
అమ్మ                   :  (మవయ్యకీ నాకూ టీ అందిస్తూ) “చిన్న పిల్లకి టీ అలవాటు చెస్తున్నావ్.. రవణా …!  ఇదిగో..  !!”

రమణ మావయ్య  :  “ఏంటమ్మణి చెంకీలతో ఎదో చేస్తున్నావ్..?”
నేను                     :  “ఇది మా ఎస్ యు పి డబల్యు క్లాస్ కోసం మావయ్య ..!”
రమణ మావయ్య  :  “అమ్మమ్మ కి అలాంటిది ఒకటి చేసి ఇవ్వు … క్రిష్ణుడి ఉయ్యాలకి కడుతుంది.  సంతోషిస్తుంది నువ్వు చేశావంటే.. !!”
( అమ్మమ్మ కి కృష్ణుడంటే మహా భక్తి… ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చాల వేడుక గా చేస్తుంది ఉయ్యాల ఒకటి కట్టి అందులో కృష్ణున్ని ఊపి … పిల్లల్ని పిలిచి చాక్లెట్లు పంచి పెడుతుంది… ఆ సందడి కోసం మరి ఉయ్యలకి కొత్త మెరుపులు కడుతూనే ఉంటుంది… అందుకే ఇలాంటి క్రాఫ్టు పని అంటే మహా ఇష్టం..
నాకూ కృష్ణుడంటే చిన్నప్పటి నుంచి ఓ soft romantic corner.. 😛 నాట్యం చేస్తే గొపికల్లో రాధని నేనే … మధురా నగరి లో చల్లలమ్మ బోదు..!! )

పదో తరగతి పరీక్షా ఫలితాలు… నాకు లెక్కల్లో నూటికి నూరు.. **************************

నాన్న సహోద్యోగులు :  “అబ్బో  … లెక్కల మాష్టారి కూతురండి ….”
నా టీచర్లు                  :  “like father like daughter…”

ఇంటర్ సెలవుల్లో … ****************************************************

అమ్మ                   :   “ఇదిగో అమ్మాయి ..! సెలవల్లో కూడా ఓ పని సాయం లేదు.. ఇట్లయితే కష్టం …”
నేను                     :   “నాకు నచ్చిన పనే చేస్తా …  నా రేంజ్ కి తగ్గ పని చెప్పమ్మా..!”
అమ్మ                   :   “మీ నాయనమ్మ నొట్లోంచి ఊడిపడ్డావ్ కదే … ప్చ్..  రేపు వచ్చేవాడు పని నేర్పలేదంటాడు ..!”
నేను                     :  “హి హి ..

********************************************************************

ఇలాంటి సంభాషణలు మీ బాల్యం లో నూ ఉన్నాయా..??
నాకయితే  ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే…  నన్ను నేను మలచుకున్నానా.. ? నా కుటుంబమే నన్ను influence చేసిందా? ఎదో ఓ విధంగా కుటుంబ సభ్యుల్ని copy కొడుతూనే ఉన్నాగా… originality అంటే ఎంటి?  నా ముక్కు నాదా.. కళ్ళు నావా ?  ఇవి చూస్కొని  మురిసి పొవడం ఎంత పిచ్చి తనం? అంతా DNA మహిమ..!

మన పుట్టుక, మన కుటుంబం మన చేష్టలను, నడవడిని నిర్ణయిస్తాయంటే నమ్ముతారా ?

Advertisements

5 Comments

Filed under Telugu

తడిసి మోపెడు – 1

“నేను ఓంకారన్ని !! “(దూరదర్శన్ ఓం నమః శివాయః) ఆ లెవెల్లో ఉందా నా ఇంట్రొడక్షన్ ? సారీ !! రెండో టపా లేట్ అయింది… నేను ఖాళీయే .. కానీ నా స్టోరీ టైపు  చేసి పెట్టాల్సిన బ్లాగు కర్త కూసంత బిజీ అంట…
ఇపుడూ…  నేను తడిసి మోపెడయిన స్టోరీ చెప్తా..  ఇనుకో … 😛

తెల్లారింది లెగండోయ్ కొక్కొరొక్కో ….
జాగ్రత్త గా ఇంట్లో నుండి బయటకు తీస్కొని వచ్చారు. girl friend దర్శనం కూడా అయింది. కాసేపటికి “కురిసింది వానా “… అని సాంగు సింగుతుంది ఓ పడచు నా మీద చానుపు (కళ్ళాపి) చల్లుతూ … “అయ్యా !! దీన్ని అడ్డంగ పెట్టినవ్ కాస్త అవతలకి జరిపితే నా పనైతది లేకుంటే గిట్లనే తడుస్తది మల్ల ” అని కేక పెట్టింది … మాష్టారు పరుగున వచ్చి నన్ను రోడ్డు మీద పెట్టేరు ఈ పని మనిషి కి దూరంగా. తర్వాత ఓ బనియన్ గుడ్డ తెచ్చి తడి తుడవడం మొదలు పెట్టేరు . “ఆహా ..! నామీద నీటి చుక్క కూద పడనివ్వడం లేదు ఎంత ప్రేమో!”

“ఏమండోయ్ ! ఉప్మా లోకి అల్లం పచ్చిమిర్చి లేవు కాస్త బండి మీద వెళ్ళి ‘ఇక్కడున్నట్లు’ పట్టుకురండి .. పోపు మాడిపోతుంది!! ” అని పంతులమ్మ పురమాయించింది. నా capacity వీళ్ళకి తెలీడం లేదు.. 😦  ఆఫ్ట్రాల్ అల్లం పచ్చిమిర్చి కి నేనా!!.. ప్చ్.. సరేనని వెళ్ళి వచ్చాం… ఇంతలో రిక్షా ఒకటి ఆగింది ఇంటి ముందు. అది ఇస్కూల్ రిచ్చా! బెల్లు మోగించాడు రిక్షా వాడు.. “మల్లయ్యా ఈరోజు మేం బండి మీద వెల్తున్నాం స్కూల్ కి ” అన్నాడు ఇంక నెక్కర్(లాగు) వేస్కోలేదు గాని బుల్లి హీరో…

“సాయంత్రం రా మల్లయ్య డబ్బులు తీస్కుందువు గాని” అని పంతులమ్మ చెప్పింది .. బుల్లి దొరని ముద్దుగా ఒకటి చరిచి “పద నెక్కర్ వెస్కొని రెడీ అవ్వు లేటవుతావు స్కూల్ కి” నా మీద నమ్మకం పెట్టుకొని ఇంక అయిదు నిమిషాల్లో స్కూల్ లో ప్రేయర్ అవుతుందనగా మొదలయ్యారు… నన్ను రిస్క్ లో పెట్టడం కాక పోతే !? చూడబోతే ఓ కొండ మీద ఉంది స్కూల్ .. ఇహ మష్టారు తొక్కీ తొక్కీ (అంటే అప్పుడప్పుడు పెడ్లింగ్ చేసి) చివరకు చేర్చారు స్కూల్. డౌన్ హిల్ ప్రయాణం భలే బాగుంది లే.. పడిన కష్టం మర్చిపొయేలా… మళ్ళీ సాయంత్రం తీస్కొని రావాలి వీళ్ళని ఇంటికి. ఈలోగా పనేమి ఉంటుందా అని చూస్తున్నా .. మాష్టారు ఎక్కడికయినా వెళ్తారు కదా నన్నూ తీస్కొనే వెళ్తారు అని ఓ కునుకు తీశా.. లేచే సరికి అదే వేప చెట్టు కాని girl friend లేదు. మాష్టారు అప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నట్టు కనిపించింది … నేను లేకుండానే వెళ్ళి వచ్చారన్న మాట.. ఈయన ఆఫీసు దగ్గరే కాబోలు… ఒక ట్రిప్ తప్పినట్టే లే అనుకున్నా..

స్కూల్ నుంచి  పిల్లల్ని తీస్కురావడానికి నాకన్నా ముందే నా girl friend బండి బయల్దేరి ఉంటుంది. మా మాష్టారు కూడా ఛాయి తాగి బయల్దేరారు. తీరా స్కూల్ కి వెళితే నా GF కనిపించలేదు కాని … ఆరుగురు పిల్లలు (మా మాష్టారి పిల్లలు కాక ఆయన బావగారి పిల్లలు) వెయిటింగ్ అక్కడ..!! మాష్టారి తో సహా ఏడుగురు నా మీద ఎక్కేవరకు నాకు అర్ధం  కాలేదు..  😦 నేను వీళ్ళని చాల తక్కువ అంచనా వేశా అని..  సడన్ గా సర్కస్ బండి అయిపొయా … దారెంట హారన్ మోగిస్తూ … చుట్టూ జనాలు కాస్త భయపడి  కాస్త నవ్వుకొని … మా మాష్టారి  ఫీట్ల తో ఇంటికి చేరం.. ఈయనకి ఇంత “కలాపోసన” ఉందనుకోలేదు..  దీనికన్నా గాడిద బతుకు నయం అనిపించింది ఒక్క ట్రిప్ లో …

ఇలా రోజూ స్కూల్లో దించడమో స్కూల్ నుంచి ఇంటికి తీస్కురావడమో  చేస్తూ  ఎక్సెలెంటు (సర్కస్) బండి  అనిపించుకున్నా …
ఇంకా “మోపెడు” స్టొరీలు  వచ్చే టపాలలో …

Disclaimer: బ్లాగు కర్త భమిడిపాటి రామ గోపాలం  హాస్య కథ “తడిసి మోపెడు” చదవలేదు … ఎక్కడయినా copy కొట్టినట్టు మీకనిపిస్తే comment కొట్టండి.. compliment అవుతుంది… ఆ కథకి లింక్ ఇస్తే మహా భాగ్యం

6 Comments

Filed under Telugu

TVS 50 ఆత్మ కథ

నేను TVS 50 ని. ఈ కాలం పిల్లలకు నేనంటే ఎవరో కూడా తెలియదేమో .  సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నేను పుట్టాను. పుట్టిన కొన్నాళ్ళకు ఓ టీచర్ నన్ను కొనుక్కున్నాడు. ఎవరయినా   ఓ బండి ని ఎందుకు కొంటారు? ఎక్కి స్వారీ చెయ్యడానికే గదా !! ఇక నాకు మొదలయినయి లే కష్టాలు అనుకున్న. ఈ జన్మకు ఇంక వెరే ఆసలు పెట్టుకుంటే మాత్రం నెరవేరుతాయా?

ఓ మంచి రోజు చూస్కొని వచ్చి తీసుకు వెళతాడట . నా పక్కన ఆకు పచ్చది, ఎర్రది నవ్వుకుంటున్నాయి. మాస్టారి కూతురికి చాక్లెట్ రంగు ఇష్టం అట అందుకే నేను దొరికిపొయా ఇతగాడికి. ఇంకేముంది రానే వచ్చింది ఆ రొజు … మా వాళ్ళకి టాటా చెప్పానిక.. మహా రాజులా ఎక్కాడు నామీద.

ఈయన నా యజమాని ఇప్పుటి నుంచి. మంచి సేవకుడిని అనిపించుకుంటే సరి ఈ జన్మ కి. ఏంటో ఈ పోజిటివ్ థింకింగ్ !!??
మాస్టారి ఇంటికి చేరడమే ఆలస్యం సకుటుంబ సమేతంగా బయటకు వచ్చి నన్ను ఆహ్వానించారు. వల్లావిడ మరీనూ హారతి పళ్ళెం  పట్టుకొచ్చేశారు. పిల్లలు మాత్రం ఎప్పుడు ఎక్కుదామా అనట్టు రెడీగా ఉన్నరు. ఒకళ్ళు కాదు .. ఇద్దరు కాదు… ముచ్చట గా ముగ్గురు. అందరూ స్కూళ్ళకి వెళ్ళే వయసు వారే. ఇప్పుడర్ధమయింది ఎందుకు నన్ను తెచ్చారో .. వీళ్ళని రోజూ స్కూళ్ళో దించి రావాలన్నమాట. “ఇంత విపరీతపు ఆలొచన దీనికి అవసరమా?” అని అనుకుంటున్నారా? తప్పు గా అనుకోకంది నా డ్యూటీస్  ఎముంటాయో తెలుసుకుంటున్నా ..!!   🙂
ఇంతలో నా యజమాని చిన్నబ్బాయి హాండిల్ తిప్పడం మొదలెట్టాడు.. ఎడం పక్క తిప్పాడు… దూరంగా ఓ జీప్  ఉంది.. మన ఫ్యామిలీ  కాదు లే అని వదిలేశా.. రైట్ టర్నింగ్ ఇచ్చాడు బుల్లి హెరొ .. ఆహా.!! నా ప్రాణం లేచి వచ్చినట్టయింది ఒక్కసారి. పక్కింటి  గేట్ ముందు గ్రీన్ కలరు టి వి ఎస్ 50 ఒకటి(తి) ఉంది. అది మా యజమాని బావగారిది 🙂 హమ్మయ్య !!  పలుకు తోడు ఉంది లే అనుకున్నా..

ఈలొగా మాస్టారి పిల్లలు నాకు పేరు ఒకటి పెట్టారు… ఎక్సెలెంట్ బండి అని.. (నా మేక్ XL ) … నన్ను పెద్ద అన్న గా భావించి 🙂 ఎక్కి తొక్కేశారు 😦 .. ఈ లోగా నేను ఆ గ్రీన్ TVS 50 కి సైగ చేసి పిలిచా.. వివరాలు అడుగుదామని.. వేప చెట్టు నీడలొ ఇద్దరం.. ఓ ఓర చూపు పడేసింది నా వైపు.. అంత కన్నా ఏం జరుగుతుంది..?? మా తలలు మా కంట్రోల్ లో ఉండవు కద..! ఇక చెప్పుకొచ్చింది స్టోరీ.. “నా యజమాని నన్ను బాగానే చూస్కుంటారు.. ఎక్కువగా కష్ట పెట్టరు… మంచి రోడ్డు పైనే స్వారీ చేస్తారు.. ఏదో అప్పుడప్పుడు కొన్ని మట్టి రోడ్లు చూశా… అంతే”

మొత్తానికి దీని life is cool అనుకున్న..మరి నా యజమాని ఎలా ఉంటాడో.. !! let us see  అనుకున్నా.. నాకు ఆకలి వేస్తుందేమో అని.. దారిలోనే full tank petrol కొట్టించారు మాస్టారు… కస్త హాయి గా నే ఉంది ప్రస్తుతానికి.. సాయంత్రం అయితే గాని తెలీదు వీళ్ళ విపరీతాలు.. అనుకొని ఓ నిద్ర తీశా.. మళ్ళీ క్లచ్ నొక్కి పట్టుకొని అక్సెలెరేటర్ తిప్పి లేపుతారు లే.. అని

సాయంత్రం మాస్టారు పిల్లలతో కలిసి గుడికి బయల్దెరారు.. నా మీద.. చిన్నోడు ముందు నిలబడతాడట.. అమ్మాయి పెద్దబ్బాయి
మాస్టారి వెనుక ..  “గట్టి గా  పట్టుకోండర్రా నాన్నని” అని వాళ్ళ అమ్మ గేటు బయటికి వచ్చి టాటా చెప్పింది… గుడికి వెళ్ళినంత సేపు ఓఓ అని కేకలు పిల్లలు.. ఇదే కొత్త కాబోలు అనుకున్న.. గుడి మెట్ల దగ్గరే నన్ను ఆపేసి వాళ్ళు లోనికి వెళ్ళేరు.. కొద్ది సేపటికి  పిల్లలు వచ్చి కుంకం బొట్టు పెట్టి వెళ్ళారు.. ఆహా ఎంత ప్రేమ.. పెద్ద అన్న మీద !! నా కళ్ళు చెమర్చాయి..అదేనండి reflector లు మెరిశాయి… తర్వాత అందరూ “నాన్నా డాం మీదకి వెల్దాం ” అన్నారు… ఆహా.. నాకు కృష్ణ నది దర్శనం.. డాం దర్సనం కూద ప్రాప్తించాయి వీరి వల్ల.. కసేపు అలా డాం మీద చెక్కర్లు కొట్టి.. బజారు కి వెళ్ళి కూరలు కొని ఇంటికి చేరాం.. చూశరా !? ఇంటికి పెద్ద అబ్బాయిని అయిపోయాను.. అన్ని పనులూ చేస్తూ.. వీరి సేవ చెస్కొని జన్మ సార్ధకం చేస్కొవాలి అనుకున్నా..

చీకటి పడేవేళ … మాస్టారి బావగారు నా girl friend బండి 😉 ని వాళ్ళింట్లో పెట్టేశారు.. నన్ను ఈ చెట్టు కిందే వదిలేస్తారేమో అని బిక్కు బిక్కు మంటుండగా వచ్చారు మాస్టారు.. ఇంట్లో కి ఎలా తీస్కు వెళ్ళాలా అని చూస్తున్నారు.. మొదట నాకు problem అర్ధం కాలేదు..  ఇంట్లో కి వెళ్ళడానికి అక్కడ మెట్లు ఉన్నాయి.. మరి నా GF కేమో జారుడు బండ కట్టించారు ఆ మాస్టారు.. మనకింకా ఆ facility లేదు. చాలా జాగ్రత్తగా నాకు ఎక్కడా గాయం తగలకుండా.. మెట్లు ఎక్కించారు.. హమ్మయ్య అనుకున్న… నాకు ఇంట్లొ కూడా చోటిచ్చిన మహరాజులు..

మిగితాకథ తర్వాతి టపాల లో …

next in series ..

తడిసి మోపెడా

సైకిల్ స్టాండు లో నేను

8 Comments

Filed under Telugu

వెండి వెలుగులు(Vendi Velugulu)

My Silverlight streaming apps
If you can’t wake him up

Leave a comment

Filed under Uncategorized

± ∆x

“మా ఇంట్లో వర లక్ష్మీ వ్రతం .రేపు సాయంత్రం 5 గంటలకు పేరంటం. తప్పకుండా వచ్చి వాయనం తీస్కొండి.”

అని మా అమ్మ తన తోటి ముత్తైదువులను ఆహ్వానించింది.

“తెల్లారే సరికి లేచి అమ్మ వారిని ఆసాదించాలి… నాకు వంట లో సాయం చెయ్యాలి … ఆ డబ్బా ముందు నుంచి లే … త్వరగా నిద్ర పో” అని నాకు హితోపదేశం.

నా చాట్ డబ్బాలు మూసి ఇక system shut down చేసి నిద్రకుపక్రమించా.

ఉదయాన్నే లేచి ముగ్గేసి … అమ్మ వారి ప్రతిమను చెయ్యడానికి నేను తయారయ్యాను. నాన్న గారు గుమ్మాలకు తోరణాలు కట్టి పాలవెల్లి అలంకరిస్తున్నారు. నేనెప్పుడూ చూసినట్లు లేదు ఈ కొత్త పాలవెల్లి మా ఇంట్లో. నాన్నని అడిగా “ఇదెక్కడిది నాన్నా?” అని.

“గుర్తు పట్టు” అన్నారు. “ఇది మేం చిన్నప్పుడు ఆడుకున్న Carrom Board frame”, అని కెవ్వుమన్నాను. ఆహ ఆడేవారు లేక దీనికి ఈ promotion వచ్చిందా అనుకున్నా. ఇలా కాలక్రమం లో పరిణామం చెందిన వస్తువులు ఇంట్లొ ఉంటూనే ఉంటాయి. ఒక వస్తువు ఒకే వస్తువు గా దాని జీవిత కాలం ఉంటుందా?

అమ్మ చీర పాప ఉయ్యాల అవుతుంది… నానమ్మ చీర బొంత(matress) అవుతుంది ..
డ్రాయింగ్ రూం లో నాన్న ఆఫీస్ టేబుల్ అన్నయ్య కంప్యుటర్ టేబుల్ అవుతుంది..

కాలెండర్ సూది కి ఆలంబన అవుతుంది .

పాత మంచం కోళ్ళు దొండ పాదు కు పందిరి కి మూల స్తంభాలు అవుతాయి.

ఇక పెరట్లో ప్లాస్టిక్ బక్కెట్లు పూల కుండీలు గా మారడం సర్వ సామాన్యం.

ఇలా ఈ పరిణమాల గురించి ఓ రీలు వేసి వచ్చా వర లక్ష్మీ అమ్మ వారి దగ్గరికి.

అసలు అమ్మవారిని తయారు చెయ్యడం లొ నే చాలా పరిణామాలు ఉన్నయండోయ్.. కింద ఫొటోలో చూసేరు గా..

Vara Lakshmi Vratam

Vara Lakshmi Vratam

ఈ half the life-size బొమ్మ ను ఎలా చేశారు? కొబ్బరి కాయ అమ్మవారికి ముఖం అయింది. ముక్కు చెవులు శనగపిండి పసుపు తో. ఆలంకారాలు కొన్ని సహజం.. మరి కొన్ని కృత్రిమం. మరి ఓ కలశం పీట మీద పెడితే చీరకట్టేయచ్చు.

వరాలిచ్చే చెతులు మరి రూళ్ళ కర్రలు వాటి ని కప్పుతూ చుట్టుని గోధుమరంగు వస్త్రం. ఆ చేతికి ఓ పువ్వొ వస్తువో ఇస్తే ఇక వేళ్ళు నిశితం గా కూర్పు చేయనవసరం లేదు గా.

అదండీ తంతు. ఇక కొత్త చీర కట్టి, కొత్తగా నగలు ఎమైనా చేయించు కుంటే అవి అమ్మవారికి వేసి, పూలతో అలంకారం చేసి, ప్రాణ ప్రతిష్ట చెసి అమ్మ వారు దిగి వచ్చింది మన కోసం అనే భావన తో వ్రత విధానానుసారం పూజ నిర్వర్తించి, సాయంత్రం వేడుక లో అందరికీ అమ్మవారి దర్శనం కల్పించి ఉద్వాసన తో ముగిస్తారు.

సరే మన టాపిక్ వ్రతం కాదు కదండి… పరిణామాలగురించి పరి పరి విధాల చర్చించి తెలుసుకున్నదెంటయ్యా అంటే.
Change is inevitable. Change is the only constant thing in the world.

ఒక మార్పు జీవితపు శైలిని సరళము చేస్తున్నదంటే అది మంచికే. మార్పు కు భయపడక ఆహ్వానించి ఆస్వాదిస్తే మనుగడకు అర్ధం ఉంది లేక పోతే we’ll be missing the very ± x..

(ప్రచురణ లో ఆలస్యానికి చింతిస్తున్నాం 😦  )

5 Comments

Filed under Telugu

telugu blogu (best viewed in IE)

ఇక్కడ తెలుగు లో కూడా వ్రాయచ్చునట ..
ఇంకేమి .. హెల్లొ తెలుగు వరల్డు

2 Comments

Filed under Uncategorized

Oh God !! Ctrl+S me !!

I am reluctant to take a book and read it. May be because I am stricken by material on internet and every thing with ‘e-‘ prefixed to it. Poor me..!! Lost completely and got addicted in one sense to my PC. So is the incompleteness and the void growing in my mind. Its alarming.. !!

I tried real hard to hold a book and read.. Its only about 200 pages and its not the original print. I give these details to tell you that its not that heavy. Oh !! I can’t hold a book for atleast 15 minutes. Are my hands so weak?

I struggled to remember how my posture was when I used to hold book in hands and read. I am sure I did it many times. Am I that forgetful?

And the funniest thing is groping for Ctrl+F on cover page. Am I getting handicapped ?

It has become so easy to type than to write something on paper. Am I saving paper ?

I don’t remember when I stopped using my water colors to paint. Am I saving colors ?

Oh God..!! Ctrl+S me !!

3 Comments

Filed under NewBees, Uncategorized