± ∆x

“మా ఇంట్లో వర లక్ష్మీ వ్రతం .రేపు సాయంత్రం 5 గంటలకు పేరంటం. తప్పకుండా వచ్చి వాయనం తీస్కొండి.”

అని మా అమ్మ తన తోటి ముత్తైదువులను ఆహ్వానించింది.

“తెల్లారే సరికి లేచి అమ్మ వారిని ఆసాదించాలి… నాకు వంట లో సాయం చెయ్యాలి … ఆ డబ్బా ముందు నుంచి లే … త్వరగా నిద్ర పో” అని నాకు హితోపదేశం.

నా చాట్ డబ్బాలు మూసి ఇక system shut down చేసి నిద్రకుపక్రమించా.

ఉదయాన్నే లేచి ముగ్గేసి … అమ్మ వారి ప్రతిమను చెయ్యడానికి నేను తయారయ్యాను. నాన్న గారు గుమ్మాలకు తోరణాలు కట్టి పాలవెల్లి అలంకరిస్తున్నారు. నేనెప్పుడూ చూసినట్లు లేదు ఈ కొత్త పాలవెల్లి మా ఇంట్లో. నాన్నని అడిగా “ఇదెక్కడిది నాన్నా?” అని.

“గుర్తు పట్టు” అన్నారు. “ఇది మేం చిన్నప్పుడు ఆడుకున్న Carrom Board frame”, అని కెవ్వుమన్నాను. ఆహ ఆడేవారు లేక దీనికి ఈ promotion వచ్చిందా అనుకున్నా. ఇలా కాలక్రమం లో పరిణామం చెందిన వస్తువులు ఇంట్లొ ఉంటూనే ఉంటాయి. ఒక వస్తువు ఒకే వస్తువు గా దాని జీవిత కాలం ఉంటుందా?

అమ్మ చీర పాప ఉయ్యాల అవుతుంది… నానమ్మ చీర బొంత(matress) అవుతుంది ..
డ్రాయింగ్ రూం లో నాన్న ఆఫీస్ టేబుల్ అన్నయ్య కంప్యుటర్ టేబుల్ అవుతుంది..

కాలెండర్ సూది కి ఆలంబన అవుతుంది .

పాత మంచం కోళ్ళు దొండ పాదు కు పందిరి కి మూల స్తంభాలు అవుతాయి.

ఇక పెరట్లో ప్లాస్టిక్ బక్కెట్లు పూల కుండీలు గా మారడం సర్వ సామాన్యం.

ఇలా ఈ పరిణమాల గురించి ఓ రీలు వేసి వచ్చా వర లక్ష్మీ అమ్మ వారి దగ్గరికి.

అసలు అమ్మవారిని తయారు చెయ్యడం లొ నే చాలా పరిణామాలు ఉన్నయండోయ్.. కింద ఫొటోలో చూసేరు గా..

Vara Lakshmi Vratam

Vara Lakshmi Vratam

ఈ half the life-size బొమ్మ ను ఎలా చేశారు? కొబ్బరి కాయ అమ్మవారికి ముఖం అయింది. ముక్కు చెవులు శనగపిండి పసుపు తో. ఆలంకారాలు కొన్ని సహజం.. మరి కొన్ని కృత్రిమం. మరి ఓ కలశం పీట మీద పెడితే చీరకట్టేయచ్చు.

వరాలిచ్చే చెతులు మరి రూళ్ళ కర్రలు వాటి ని కప్పుతూ చుట్టుని గోధుమరంగు వస్త్రం. ఆ చేతికి ఓ పువ్వొ వస్తువో ఇస్తే ఇక వేళ్ళు నిశితం గా కూర్పు చేయనవసరం లేదు గా.

అదండీ తంతు. ఇక కొత్త చీర కట్టి, కొత్తగా నగలు ఎమైనా చేయించు కుంటే అవి అమ్మవారికి వేసి, పూలతో అలంకారం చేసి, ప్రాణ ప్రతిష్ట చెసి అమ్మ వారు దిగి వచ్చింది మన కోసం అనే భావన తో వ్రత విధానానుసారం పూజ నిర్వర్తించి, సాయంత్రం వేడుక లో అందరికీ అమ్మవారి దర్శనం కల్పించి ఉద్వాసన తో ముగిస్తారు.

సరే మన టాపిక్ వ్రతం కాదు కదండి… పరిణామాలగురించి పరి పరి విధాల చర్చించి తెలుసుకున్నదెంటయ్యా అంటే.
Change is inevitable. Change is the only constant thing in the world.

ఒక మార్పు జీవితపు శైలిని సరళము చేస్తున్నదంటే అది మంచికే. మార్పు కు భయపడక ఆహ్వానించి ఆస్వాదిస్తే మనుగడకు అర్ధం ఉంది లేక పోతే we’ll be missing the very ± x..

(ప్రచురణ లో ఆలస్యానికి చింతిస్తున్నాం 😦  )

Advertisements

5 Comments

Filed under Telugu

5 responses to “± ∆x

 1. సాహితీ! చాలా బాగుంది ఈ పోస్టు… U have a nice style of writing. Why dont u blog regularly??

 2. And forgot…. the title of this post is the best part of it! 🙂

 3. మేము కూడా ..అదే ఆలస్యానికి చింతిస్తున్నాం.
  టైటిలు బాగుంది .. కాని మేటరుకి దానికి సంబంధం అర్ధం కాలా 😦

 4. పరీశీలన బాగుందమ్మాయీ!
  చక్కటి శక్తి రుపాంతర సిద్దాంత ప్రతిబింబం…
  చిన్న చిన్న మార్పుల్లొ ఎంతొ ఆనందం, జ్ఞానం ఇమిడి వున్న్నపుడు, ఉత్క్రుక్రుష్టమైన మానవ జన్మ మార్పు అహ్వానిస్తూ, మరింత పరిణతి చెందుతున్నడో చరిత్ర సాక్ష్యం !!

  మానవ శరీరం కూడ ఇలాంటి మార్పు చెందె అవకాశం వున్నది — అవయవ మార్పిడి ద్వారా, ఒక్కడిగ పుట్టి, మరల పదుగురిగ మారే అవకాశం పరీశీలన బాగుందమ్మాయీ!
  చక్కటి శక్తి రుపాంతర సిద్దాంత ప్రతిబింబం…
  చిన్న చిన్న మార్పుల్లొ ఎంతొ ఆనందం, జ్ఞానం ఇమిడి వున్న్నపుడు, ఉత్క్రుక్రుష్టమైన మానవ జన్మ మార్పు అహ్వానిస్తూ, మరింత పరిణతి చెందుతున్నడో చరిత్ర సాక్ష్యం !!

  మానవ శరీరం కూడ ఇలాంటి మార్పు చెందె అవకాశం వున్నది — అవయవ మార్పిడి ద్వారా, ఒక్కడిగ పుట్టి, మరల పదుగురిగ మారే అవకాశం !! http://www.mohanfoundation.org/

 5. Viswanath

  Nee lo maro darwin kanapaduthunaadu 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s