తడిసి మోపెడు – 1

“నేను ఓంకారన్ని !! “(దూరదర్శన్ ఓం నమః శివాయః) ఆ లెవెల్లో ఉందా నా ఇంట్రొడక్షన్ ? సారీ !! రెండో టపా లేట్ అయింది… నేను ఖాళీయే .. కానీ నా స్టోరీ టైపు  చేసి పెట్టాల్సిన బ్లాగు కర్త కూసంత బిజీ అంట…
ఇపుడూ…  నేను తడిసి మోపెడయిన స్టోరీ చెప్తా..  ఇనుకో … 😛

తెల్లారింది లెగండోయ్ కొక్కొరొక్కో ….
జాగ్రత్త గా ఇంట్లో నుండి బయటకు తీస్కొని వచ్చారు. girl friend దర్శనం కూడా అయింది. కాసేపటికి “కురిసింది వానా “… అని సాంగు సింగుతుంది ఓ పడచు నా మీద చానుపు (కళ్ళాపి) చల్లుతూ … “అయ్యా !! దీన్ని అడ్డంగ పెట్టినవ్ కాస్త అవతలకి జరిపితే నా పనైతది లేకుంటే గిట్లనే తడుస్తది మల్ల ” అని కేక పెట్టింది … మాష్టారు పరుగున వచ్చి నన్ను రోడ్డు మీద పెట్టేరు ఈ పని మనిషి కి దూరంగా. తర్వాత ఓ బనియన్ గుడ్డ తెచ్చి తడి తుడవడం మొదలు పెట్టేరు . “ఆహా ..! నామీద నీటి చుక్క కూద పడనివ్వడం లేదు ఎంత ప్రేమో!”

“ఏమండోయ్ ! ఉప్మా లోకి అల్లం పచ్చిమిర్చి లేవు కాస్త బండి మీద వెళ్ళి ‘ఇక్కడున్నట్లు’ పట్టుకురండి .. పోపు మాడిపోతుంది!! ” అని పంతులమ్మ పురమాయించింది. నా capacity వీళ్ళకి తెలీడం లేదు.. 😦  ఆఫ్ట్రాల్ అల్లం పచ్చిమిర్చి కి నేనా!!.. ప్చ్.. సరేనని వెళ్ళి వచ్చాం… ఇంతలో రిక్షా ఒకటి ఆగింది ఇంటి ముందు. అది ఇస్కూల్ రిచ్చా! బెల్లు మోగించాడు రిక్షా వాడు.. “మల్లయ్యా ఈరోజు మేం బండి మీద వెల్తున్నాం స్కూల్ కి ” అన్నాడు ఇంక నెక్కర్(లాగు) వేస్కోలేదు గాని బుల్లి హీరో…

“సాయంత్రం రా మల్లయ్య డబ్బులు తీస్కుందువు గాని” అని పంతులమ్మ చెప్పింది .. బుల్లి దొరని ముద్దుగా ఒకటి చరిచి “పద నెక్కర్ వెస్కొని రెడీ అవ్వు లేటవుతావు స్కూల్ కి” నా మీద నమ్మకం పెట్టుకొని ఇంక అయిదు నిమిషాల్లో స్కూల్ లో ప్రేయర్ అవుతుందనగా మొదలయ్యారు… నన్ను రిస్క్ లో పెట్టడం కాక పోతే !? చూడబోతే ఓ కొండ మీద ఉంది స్కూల్ .. ఇహ మష్టారు తొక్కీ తొక్కీ (అంటే అప్పుడప్పుడు పెడ్లింగ్ చేసి) చివరకు చేర్చారు స్కూల్. డౌన్ హిల్ ప్రయాణం భలే బాగుంది లే.. పడిన కష్టం మర్చిపొయేలా… మళ్ళీ సాయంత్రం తీస్కొని రావాలి వీళ్ళని ఇంటికి. ఈలోగా పనేమి ఉంటుందా అని చూస్తున్నా .. మాష్టారు ఎక్కడికయినా వెళ్తారు కదా నన్నూ తీస్కొనే వెళ్తారు అని ఓ కునుకు తీశా.. లేచే సరికి అదే వేప చెట్టు కాని girl friend లేదు. మాష్టారు అప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నట్టు కనిపించింది … నేను లేకుండానే వెళ్ళి వచ్చారన్న మాట.. ఈయన ఆఫీసు దగ్గరే కాబోలు… ఒక ట్రిప్ తప్పినట్టే లే అనుకున్నా..

స్కూల్ నుంచి  పిల్లల్ని తీస్కురావడానికి నాకన్నా ముందే నా girl friend బండి బయల్దేరి ఉంటుంది. మా మాష్టారు కూడా ఛాయి తాగి బయల్దేరారు. తీరా స్కూల్ కి వెళితే నా GF కనిపించలేదు కాని … ఆరుగురు పిల్లలు (మా మాష్టారి పిల్లలు కాక ఆయన బావగారి పిల్లలు) వెయిటింగ్ అక్కడ..!! మాష్టారి తో సహా ఏడుగురు నా మీద ఎక్కేవరకు నాకు అర్ధం  కాలేదు..  😦 నేను వీళ్ళని చాల తక్కువ అంచనా వేశా అని..  సడన్ గా సర్కస్ బండి అయిపొయా … దారెంట హారన్ మోగిస్తూ … చుట్టూ జనాలు కాస్త భయపడి  కాస్త నవ్వుకొని … మా మాష్టారి  ఫీట్ల తో ఇంటికి చేరం.. ఈయనకి ఇంత “కలాపోసన” ఉందనుకోలేదు..  దీనికన్నా గాడిద బతుకు నయం అనిపించింది ఒక్క ట్రిప్ లో …

ఇలా రోజూ స్కూల్లో దించడమో స్కూల్ నుంచి ఇంటికి తీస్కురావడమో  చేస్తూ  ఎక్సెలెంటు (సర్కస్) బండి  అనిపించుకున్నా …
ఇంకా “మోపెడు” స్టొరీలు  వచ్చే టపాలలో …

Disclaimer: బ్లాగు కర్త భమిడిపాటి రామ గోపాలం  హాస్య కథ “తడిసి మోపెడు” చదవలేదు … ఎక్కడయినా copy కొట్టినట్టు మీకనిపిస్తే comment కొట్టండి.. compliment అవుతుంది… ఆ కథకి లింక్ ఇస్తే మహా భాగ్యం

Advertisements

6 Comments

Filed under Telugu

6 responses to “తడిసి మోపెడు – 1

 1. Radhika

  Good one .. took me to my good old days of schooling..

 2. భ రాగో కథలు దొరికి పొయాయోచ్
  http://www.scribd.com/doc/6274505/bhamidipati-ramagopalamPart1

  Page 39 has the story .. but the treatment is different.. 🙂

 3. sharemyopinion

  Nice one.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s