uaaa uaaa (kaar kaar) నేను పుట్టాను

ఉఆఉఆ…  నేను పుట్టాను… ***********************************************

మేనత్త(సీత)  :   “వదినా!! అచ్చు నీ లాగే ఉంది పాప …”
అమ్మ            :    “నాలా  ఏం లేదు… మేనత్త పొలికలు దిగాయి.. రంగొక్కటే తేడా.. ”

మేనత్త(సీత)  :    “కళ్ళు నావే.. ముక్కు అమ్మది … రంగు నీది… నాలా పొట్టి అవుతుందో .. నీ పొడవు అవుతుందో”
మేనత్త(కృష్ణ) :    “అన్నయ్య కర్రెగా ఉన్నా నీలా ఎర్రగా పుట్టింది… దీని పెళ్ళికి చింత లేదులే.. హ హ …”

మూడేళ్ళ తర్వాత … *****************************************************

అమ్మ            :    “దీని అల్లరి భరించలేను .. ఒకటె యక్ష ప్రశ్నలేస్తుంది సీతమ్మ వేసినట్టు ”
నాన్న            :    “సాహులూ … ఇటు రామ్మా ..! ఇక్కడ ఆడుకో…!!   అమ్మని సతాయించకు …”
నేను              :    “ఏవండీ (నాన్నని అమ్మ ఏమని పిలిస్తే అలాగే పిల్చేది)!! .. అమ్మ నాకు రెండు బిస్కట్లు ఇవ్వట్లేదు”

అమ్మ            :    “అదానే నీ నస”

నాలుగేళ్ళు … **********************************************************

నేను              :    “నాన్నా .. మూర్తి మావయ్య వచ్చిండు !!”
నాన్న            :     “దీనికి ఈ భాష ఎవర్రా నేర్పించింది..!! మన ఇంట్లో ఎవరూ యాస మట్లాడకుండానే పట్టేసిందా..? హు దేవరకొండ  effect”
అన్న             :     “ఆకాశం లో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ …ఝుం ఝుం ఝుం ఝుంతన ఝుం.. ”
నాన్న            :     “వీడితో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పించాలనుకుంటే వీడేంటే..!? ”

రికార్దంగు మొదలు …. ****************************************************

నాన్న            :    “స్టార్ట్ …
అన్న             :    “టింకిల్ టింకిల్ లిత్తిత్తాల్   హవ్వయ్ వండర్ వాత్తు ఆర్ …. ”
నాన్న            :    “స్టాప్  …”
అమ్మ            :    “రికార్డు అయిందా అండి .!!?  ఎదీ వినిపించండి.. ”

అయిదేళ్ళు… **********************************************************

మేనత్త (సునంద) :   “స్కూల్లో ఏడవకుండా ఉంటుందా వదినా..?
అమ్మ                   :   “వీళ్ళ స్కూల్లో LKG టీచర్ కి ఇదంటే ఎంత ఇష్టమో .. కానీ నేను దీన్ని క్లాసులో వదిలి స్కూలు గేటు దగ్గరికి వచ్చే దాక కూడ మరిపించలేదు… కొన్ని రొజులు  తెలుగు   మీడియం ఒకటో తరగతి లో శివ తోపాటు కూర్చోపెడితే స్కూలంటే భయం పొతుందేమో  … నెత్తిన కుండ పెట్టుకొని  పుట్టింది..! ప్చ్!!”

క్లాస్ లో … ************************************************************

టీచర్           :  “పలకండి .. ఒకటీ … ”
విద్యార్థులు  : “ఒకటీ…”
టీచర్           : “రెండూ …”
విద్యార్థులు  : “రెండూ …”
నేను            : “తీచర్ తీచర్ నాకు ఇది రాదు.. ఆ తీచర్ ఏ బీ సీ డీ చెప్పింది అదే చెప్తా”…
టీచర్           : “!! ఎవరీ పిల్ల ?? ఈ క్లాస్  కాదే..!!”
శివ బావ      : “నా మరదలు టీచర్…  LKG లొ ఏడుస్తుందని ఇక్కడ కూర్చోపెట్టారు..!”
టీచర్           :”ఆఆ ..!!”

ఎనిమిది తొమ్మిది యేళ్ళు …************************************************

నేను            :   “ఇదిగో అమ్మమ్మ … మంచినీళ్ళూ…”
నాన్న సహోద్యొగిని (కాస్త సీనియరే ) :  “ఆసి భడవ … అమ్మమ్మ అంటావా ?? జుట్టు నరిసింది అంతే.. ఏం చదువుతూందండీ అమ్మాయి.. ?”
నేను & నాన్న  : “థర్డు క్లాసు .. ”
నాన్న సహోద్యొగిని : “తాతల తెలువులు ఎక్కడికి పొతాయ్ !! … ఫస్టు వస్తుందా క్లాసులో ?? ”
నాన్న : “ఎదో… మీ అభిమానం ఆశీర్వాదం … ”

అయిదో తరగతి అనుకుంటా … ***********************************************

అన్నయ్య తమ్ముడూ డిషుం డిషుం ఆడుకుంటున్నారు  ..  నేను  ఎత్తి ఉన్న మంచం కోడుకు వేలాడి ఊగుతున్నా.. నాన్న అప్పుడే ఇంట్లోకి వస్తున్నారు.. నేను చూశా.. చటక్కున చతికిల బడి బుక్ అందుకున్న….
నాన్న          :   “బెత్తం ఎదిరా..! ఆయ్..! గోలేక్కువయింది …! అది చూడంది ఎంత బుధ్ధిగా చదువుకుంటుందో .. ఆడ పిల్లని చూసి నేర్చుకోండిరా.. ”
నేను            :   (ఇదే అవకాశం హి హి ) “నాన్నా ..! విశాలి కి 5th టేబుల్ కూడా వచ్చంట.. బాబాయి ‘నాకూ నేర్పించు’ అంటే రాసివ్వలేదు  … ”
అన్న&  తమ్ముడు : “ప్చ్ రాక్షసి !! … మాకూ ఓ సిగ్నల్ ఇయ్యచ్చు కదే నాన్న వస్తున్నారని… ”

బాబాయి     :   “బాబాయి మీదే కంప్లయింటా .. కృష్ణ ని అత్తగారింటికి పంపాం .. ఇంకో కిష్టమ్మ తయారయింది..!”

ఇంకొంచెం పెద్దయ్యాక …****************************************************

నేను                     :   “అమ్మా రవణ మావయ్య కి టీ తీస్కురా  …. (నెక్స్ట్ డయలాగ్ మావయ్యది … అన్నట్టు సై గ చేశా… )”
రమణ మావయ్య :   “అమ్మాయ్ (అమ్మని మావయ్య అలాగే పిలుస్తాడు) …  లిటుకు కి కూడా ఓ కప్పు..”
నేను                     :   “మావయ్యా… !! నన్ను లిటుకు అని పిలవద్దు…”
రమణ మావయ్య  :  “సరే.. itihas …”  (sahiti ని తిరగేసి పిలవడం మావయ్యకి అలవాటు 🙂  నా పేరు లో ఈ  specialty ని కనిపెట్టింది ఆయనే..)
అమ్మ                   :   “రవణా..!  అది హార్లిక్స్ తాగింది లే …!”
రమణ మావయ్య  :  “అహ.. నా తోపాటు కంపెనీ ..”
నేను (మెల్లగా)     :   “మా మంచి మావయ్య.. :)” (ఇది మా ఇద్దరి టీ డీల్)
అమ్మ                   :  (మవయ్యకీ నాకూ టీ అందిస్తూ) “చిన్న పిల్లకి టీ అలవాటు చెస్తున్నావ్.. రవణా …!  ఇదిగో..  !!”

రమణ మావయ్య  :  “ఏంటమ్మణి చెంకీలతో ఎదో చేస్తున్నావ్..?”
నేను                     :  “ఇది మా ఎస్ యు పి డబల్యు క్లాస్ కోసం మావయ్య ..!”
రమణ మావయ్య  :  “అమ్మమ్మ కి అలాంటిది ఒకటి చేసి ఇవ్వు … క్రిష్ణుడి ఉయ్యాలకి కడుతుంది.  సంతోషిస్తుంది నువ్వు చేశావంటే.. !!”
( అమ్మమ్మ కి కృష్ణుడంటే మహా భక్తి… ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చాల వేడుక గా చేస్తుంది ఉయ్యాల ఒకటి కట్టి అందులో కృష్ణున్ని ఊపి … పిల్లల్ని పిలిచి చాక్లెట్లు పంచి పెడుతుంది… ఆ సందడి కోసం మరి ఉయ్యలకి కొత్త మెరుపులు కడుతూనే ఉంటుంది… అందుకే ఇలాంటి క్రాఫ్టు పని అంటే మహా ఇష్టం..
నాకూ కృష్ణుడంటే చిన్నప్పటి నుంచి ఓ soft romantic corner.. 😛 నాట్యం చేస్తే గొపికల్లో రాధని నేనే … మధురా నగరి లో చల్లలమ్మ బోదు..!! )

పదో తరగతి పరీక్షా ఫలితాలు… నాకు లెక్కల్లో నూటికి నూరు.. **************************

నాన్న సహోద్యోగులు :  “అబ్బో  … లెక్కల మాష్టారి కూతురండి ….”
నా టీచర్లు                  :  “like father like daughter…”

ఇంటర్ సెలవుల్లో … ****************************************************

అమ్మ                   :   “ఇదిగో అమ్మాయి ..! సెలవల్లో కూడా ఓ పని సాయం లేదు.. ఇట్లయితే కష్టం …”
నేను                     :   “నాకు నచ్చిన పనే చేస్తా …  నా రేంజ్ కి తగ్గ పని చెప్పమ్మా..!”
అమ్మ                   :   “మీ నాయనమ్మ నొట్లోంచి ఊడిపడ్డావ్ కదే … ప్చ్..  రేపు వచ్చేవాడు పని నేర్పలేదంటాడు ..!”
నేను                     :  “హి హి ..

********************************************************************

ఇలాంటి సంభాషణలు మీ బాల్యం లో నూ ఉన్నాయా..??
నాకయితే  ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే…  నన్ను నేను మలచుకున్నానా.. ? నా కుటుంబమే నన్ను influence చేసిందా? ఎదో ఓ విధంగా కుటుంబ సభ్యుల్ని copy కొడుతూనే ఉన్నాగా… originality అంటే ఎంటి?  నా ముక్కు నాదా.. కళ్ళు నావా ?  ఇవి చూస్కొని  మురిసి పొవడం ఎంత పిచ్చి తనం? అంతా DNA మహిమ..!

మన పుట్టుక, మన కుటుంబం మన చేష్టలను, నడవడిని నిర్ణయిస్తాయంటే నమ్ముతారా ?

Advertisements

5 Comments

Filed under Telugu

5 responses to “uaaa uaaa (kaar kaar) నేను పుట్టాను

  1. Radhika

    >>మన పుట్టుక, మన కుటుంబం మన చేష్టలను, నడవడిని నిర్ణయిస్తాయంటే నమ్ముతారా ?
    నమ్ముతాను.

  2. anthaa vishnu (jeans) maaya… :))

  3. uvvetthu shikharale disha nirdeshistaayi… manishi kuda kutumbham lo manchini – pempondinchukuntu…negatives ni sari cheskuntu.. nitya vidyardhila edagadame…

  4. అంత బాగుంది కానీ, “రేపు వచ్చేవాడు పని నేర్పలేదంటాడు” ఇది మాత్రం నిజం కాదు. నీతో వేగ లేక వాడే చేసుకుంటాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s